సాక్షి, జగిత్యాల(కరీంనగర్): జిల్లా పార్లమెంట్ ఎన్నికలకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు రావడంతో కలెక్టర్ శరత్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎన్నికలను చక్కడా నిర్వహించామని, ఎన్నికల అధికారులు, పోటీ చేసిన అభ్యర్థుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు కారణమని తెలిపారు. సమిష్టి కృషితో పని చేస్తూ ప్రజలకు మెరుగైనా సేవలను అందిస్తున్నామన్నారు. దేశస్థాయిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలవడం సంతోషకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


