‘బాహుబలి’పై ఐటీ దాడులు | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’పై ఐటీ దాడులు

Published Sat, Nov 12 2016 1:55 AM

‘బాహుబలి’పై ఐటీ దాడులు - Sakshi

హైదరాబాద్: బాహుబలి సినీ నిర్మాతలు, కార్యాలయాలపై శుక్రవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగాయి. ఆర్కా మీడియా పతాకంపై నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కార్యాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.2 ఉండగా, నిర్మాత శోభు యార్లగడ్డ నివాసం ఫిలింనగర్‌లో, మరో నిర్మాత ప్రసాద్ దేవినేని ఇల్లు జూబ్లీహిల్స్‌లో ఉంది. 25 మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ మూడు చోట్ల ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో రూ.60 కోట్ల మేర రద్దయిన పాత నోట్లను గుర్తించినట్లు సమాచారం. అలాగే సినిమాకు సంబంధించిన రశీదులు, కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement