యథేచ్ఛగా సాగిన అక్రమ నిర్మాణాలు | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా సాగిన అక్రమ నిర్మాణాలు

Published Thu, Nov 20 2014 3:17 AM

యథేచ్ఛగా సాగిన అక్రమ నిర్మాణాలు - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో బహుళ అంతస్తుల (అపార్టుమెంట్ల) సంస్కృతి రోజు రోజుకూ విస్తరిస్తోంది. అగ్నిమాపక, నగర ప్రణాళిక, గ్రామ పంచాయతీల అనుమతులు లేకున్నా నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం ఏళ్ల తరబడి సాగుతున్నా, వాటిని నియంత్రించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు.

ఇందుకు రాజకీయ జోక్యం, ఒత్తిళ్లు, మామూళ్లు ఇలా కారణాలు ఎన్నో! నిబంధనలను తుంగ లో తొక్కి యథేచ్ఛగా సాగించిన అపార్టుమెంట్ల నిర్మాణంపై ఫిర్యాదులు అందినా బుట్టదాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలపై కన్నెత్తయినా చూడలేదు. ఒకవేళ పరిశీలించినా తీసుకున్న చర్యలేమీ లేవు. తీరా అపార్టుమెంట్ల ని ర్మాణం పూర్తయి, వాటి ని కొనుగోలు చేసినవా రు గృహప్రవేశం చేశాక, చేసేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో అధికారులు చర్యలకు సిద్ధం  కావడం చర్చనీయాంశం అవుతోంది.

 ఇప్పుడెందుకో నోటీసులు
 గంగాస్థాన్ ఫేజ్-2లో ఒక అపార్టుమెంట్‌ను కూల్చివేయడం ద్వారా చర్యలకు దిగిన పంచాయతీ అధికారులు, ఒక్క నిజామాబాద్ డీఎల్‌పీఓ పరిధిలోని గంగాస్థాన్ ఫేజ్-2, గూపన్‌పల్లి, మానిక్‌భండార్‌ల పరిధిలో 12 అపార్టుమెంట్లను అక్రమంగా నిర్మించారని తేల్చారు. ఏడు అపార్టుమెంట్లలో ఇప్పటికే నివాసం ఉంటున్న 313 కు టుంబాలకు నోటీసులు జారీ చేశారు. నగరంలోనూ నిబంధనలను విస్మరిం చి అపార్టుమెంట్లు, భవనాల నిర్మాణాలు సాగుతున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకో వడం లేదు.

 తమ లెక్కల ప్రకారం 98 అపార్టుమెంట్లుంటే, అందులో నాలిగింటికి అనుమతులు లేకపోవడంతో నోటీసులు జారీ చేశామంటున్నారు. అడుగడుగునా నిబ ంధనలను ఉల్లంఘిస్తూ నిర్మిస్తున్న అపార్టుమెంట్లపై అధికారులు ఇంతకాలంగా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఎట్టకేలకు కదిలిన అధికార యం త్రాంగం చర్యలకు దిగడం చర్చనీయాంశం అవుతోంది. గూపన్‌పల్లి పరిధిలోని గంగాస్థాన్ ఫేజ్-2లో మంగళవారం అనుమతులు లేకుండా నిర్మించారని ఓ అపార్టుమెంట్‌ను కూల్చివేయడం కలకలం రేపుతోంది. గూపన్ పల్లిలో కాకుండా నగరంతోపాటు పలుచోట్ల రియల్‌ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలను తుం గలో తొక్కి అపార్టుమెంట్లు నిర్మించారు.

వినాయకనగర్, మానిక్‌భండార్ తదితర ప్రాంతాలలో నిర్మించిన కొన్ని అపార్టుమెంట్ల సమీపంలో రోడ్లు కనీసం 15 అడుగులు కూడా లేవు. ఆ వీధుల్లో ఎంచక్కా ఐదు అంతస్తుల భవనాలు పుట్టుకొ చ్చాయి. కనీసం సెట్ బ్యాక్ (ఖాళీ స్థలం). ఫైర్ ఫైటింగ్ సిస్టం (అగ్ని ప్రమాదాల నిరోధక వ్యవస్థ) ఏర్పాటు చేయలేదు. అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు నిర్మించారు. కానీ, అధికారులు ఒక్క భవనం జోలికే వెళ్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అపార్టుమెంట్ల నిర్మాణంలో కొందరు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ప్రజాప్రతి నిధులు సూత్రధారులుగా వ్యవహరిస్తుండట మే ఇందుకు కారణమంటున్నారు.

ఎక్కడ పడి తే అక్కడ సాగుతున్న అక్రమ కట్టడాల కారణంగా నగర పాలక సంస్థ ఆదాయానికి భారీ గా గండి పడుతోంది. అనేక మంది భవన యజమానులు నేల, మొదటి అంతస్తులకు అనుమతులు తీసుకుంటూ ఆపై రెండు, మూ డు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారం లో రూ. లక్షలు చేతులు మారుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు చూసీచూడనట్టు వదిలేయాలంటూ అధికారుల కు హుకుం జారీ చేయడం.. ఇదే అదనుగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మరిన్నికట్టడాలకు దారులు తెరుస్తున్నారు.

అవినీతికి కేరాఫ్ నగర, పట్టణ శివార్లను ఆనుకుని ఉన్న ప్రాంతాలు అపార్టుమెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైన ప్రాంతాలుగా మా రాయి. ఆయా గ్రామ పంచాయతీలలో పనిచేసే కొందరు అవినీతి అధికారులు ‘మామూళ్ల’కు మరిగారు. ఫలితంగా గూపన్‌పల్లి, మానిక్‌భండార్, గంగాస్థాన తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో ముగ్గురు అవినీతి వీఆర్‌ఓలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారంటే, ఆ శాఖలోని కిం దిస్థాయి ఉద్యోగులలో అవినీతి ఎంత పెరి గిందో అంచనా వేయవచ్చు.

నగరాలు, పట్టణాలలో ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. ముందుగా తాము కట్టాలనుకుంటున్న నిర్మాణాల వివరాలను ప్రణాళిక విభాగానికి దరఖాస్తుతో పాటు అందజేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బృహత్ ప్ర ణాళిక (మాస్టర్ ప్లాన్) అనుగుణంగా ఉన్న స్థలంలో భవనాన్ని ఎంతమేర విస్తీర్ణంలో నిర్మించాలి? ఖాళీ స్థలం ఎంత వదలాలో నిర్ణయిస్తారు. అనంతరమే నిర్మాణాలు ప్రారంభించాలి. కానీ నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పురపాలక సంఘాల్లోనూ పట్టణ ప్రణాళికా విభాగం సూచించిన మేర 50 శాతం కూడ నిర్మాణాలు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement