గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం  | Invitation to Gurukula School admissions | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం 

Mar 20 2018 11:10 AM | Updated on Aug 17 2018 3:08 PM

Invitation to Gurukula School admissions - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు అ ర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను జిల్లా మైనార్టీ శాఖ ఆహ్వానిస్తోంది. అలాగే ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి రత్న కల్యాణి తెలిపారు. రాజేంద్రనగర్‌ (బాలురు, బాలికలు), ఫరూఖ్‌నగర్‌ (బాలికలు), శేరిలింగంపల్లి (బాలురు), హయత్‌నగర్‌ (బాలురు, బాలికలు), ఇబ్రహీంపట్నం (బాలికలు), బాలాపూర్‌ (బాలురు), మెయినాబాద్‌ (బాలికలు)లో పాఠశాలలు ఉన్నాయని చెప్పారు.

ముస్లిం, క్రైస్తవ, పార్సీ, జైనులు, సిక్కులు, బౌద్ధ విద్యార్థులకు 75 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీ సీ, ఇతరులకు 25 శాతం ప్రకారం సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల 20వ తేదీలోగా www. tmreis. telangana. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు, పాస్‌ పోర్ట్‌సైజు ఫొటో, బర్త్‌ సర్టిఫికెట్, బోనాఫైడ్, వార్షికాదాయ ధ్రువపత్రాలు అవసరమ న్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో సంప్రదించాని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement