హాస్టల్ టు హోమ్ టౌన్ | intermediate exams completed | Sakshi
Sakshi News home page

హాస్టల్ టు హోమ్ టౌన్

Mar 23 2015 4:11 PM | Updated on Sep 26 2018 3:25 PM

హాస్టల్ టు హోమ్ టౌన్ - Sakshi

హాస్టల్ టు హోమ్ టౌన్

సోమవారంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో చదువుల నిమిత్తం నగరాలకు వచ్చిన పలువురు విద్యార్థులు ఇంటిబాట పట్టారు.

వరంగల్ : హమ్మయ్య... పరీక్షలు అయిపోయాయి.. ఇక హాయిగా సేదతీరడమే తరువాయి. నిన్నటి వరకూ పుస్తకాలతో కుస్తీ పట్టిన కుర్రకారుకు ఇక విశ్రాంతి లభించనుంది. తెలంగాణలో సోమవారంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో చదువుల నిమిత్తం నగరాలకు వచ్చిన పలువురు విద్యార్థులు ఇంటిబాట పట్టారు.

ఎటుచూసినా బ్యాగులు, పెట్టెలతో సొంత ఊళ్లకు వెళ్లే దారులు వెతుక్కుంటూ బారులుతీరారు. హాస్టళ్లను ఖాళీ చేసి బస్‌స్టేషన్‌ల బాట పట్టారు. దీంతో పలు జిల్లాలలో బస్‌స్టేషన్ లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement