కరోనా యోధులపై నేడు పూలవర్షం | Sakshi
Sakshi News home page

కరోనా యోధులపై నేడు పూలవర్షం

Published Sun, May 3 2020 2:18 AM

Indian Air Force To Honour Frontline Healthworkers For Fighting Covid-19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వారియర్స్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యసేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై ఆదివారం ఉదయం 9.30 గంటలకు పూలవర్షం కురిపించేందుకు భారత వాయుసేన రంగం సిద్ధం చేసింది. శనివారం ఆస్పత్రి పరిసరాల్లో ట్రయల్‌రన్‌ నిర్వహించింది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావం ప్రకటిస్తూ వారిపై పూలవాన కురి పించాలని త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌రావత్‌ పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్‌ విగ్రహం వద్ద వాయుసేన హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, పారిశుధ్యం, పారామెడికల్, పోలీస్, నాల్గవ తరగతి ఉద్యోగులపై పూలవాన కురిపించనున్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కమాండ్‌ కెప్టెన్‌ కేఎస్‌ రాజు, గ్రూప్‌ కెప్టెన్‌ పంకజ్‌గుప్తా నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ పొందిన వాయుసేన దళాలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపిస్తాయి. చదవండి: కరోనా: ఓ అడుగు ముందుకు.. 

Advertisement
Advertisement