
ఎట్టకేలకు కరుణించిన ఆర్థిక శాఖ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలు అంశంపై ఎట్టకేలకు ఆర్థిక శాఖ బుధవారం కరుణించింది.
* వారంలోగా ఉద్యోగులకు పెరిగిన వేతన బకాయిలు
* 4.5 లక్షల మంది ఉద్యోగులకు రూ.1,200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలు అంశంపై ఎట్టకేలకు ఆర్థిక శాఖ బుధవారం కరుణించింది. పదో వేతన సవరణ (పీఆర్సీ) ద్వారా పెరిగిన వేతన బకాయిలు వారంలోగా ఉద్యోగుల చేతికి అందనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పెరిగిన వేతనాల బకాయిలను నగదు రూపంలో పొందేందుకు ఆర్థిక శాఖ మోక్షం కల్పించింది.
సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) ద్వారానే పెరిగిన వేతనాలను ఉద్యోగులకు లెక్కకట్టాలని, తద్వారానే వేతనాలు చెల్లింపు చేయాలని ఆర్థిక శాఖ తొలుత ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సీఎఫ్‌ఎంఎస్ సక్రమంగా పనిచేయకపోవడంతో గత మూడు నెలల నుంచి పెరిగిన పీఆర్సీ వేతనాలను కేవలం 30 మందికి మాత్రమే చెల్లించగలిగారు. మిగతా ఉద్యోగులు పాత వేతనాలనే పొందుతున్నారు.
దీనిపై ‘సాక్షి’తో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గళం ఎత్తడం తో ఎట్టకేలకు హెచ్‌ఆర్‌ఎంఎస్ (హ్యూమన్ రీ సోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) సాఫ్ట్‌వేర్ ద్వా రానే పెరిగిన వేతనాలను, ఏప్రిల్ నుంచి జూన్ వరకు చెల్లించాల్సిన బకాయిలను ఉద్యోగుల కు ఇవ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.రవిచం ద్ర బుధవారం జీవో 85 జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని 4.5 లక్షల మంది ఉద్యోగులకు పెరిగిన వేతనాల బకాయిలు రూ.1,200 కోట్లు వారం రోజుల్లోగా చెల్లింపు పూర్తి అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. సీఎఫ్‌ఎంఎస్ ద్వారానే చెల్లిస్తామంటూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ గత నాలుగు నెలలుగా చేసి న ప్రయోగం విఫలం చెందినట్లు స్పష్టమైంది.
ఈ నెల 8 వరకు సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థలో న మోదైన ఉద్యోగులకు ఆ వ్యవస్థ ద్వారానే పెరి గిన వేతనాల చెల్లింపు కొనసాగుతుందని, మిగ తా ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ఎంఎస్ ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాల్సిం దిగా ట్రెజరీ అధికారులను ఉత్తర్వుల్లో ఆదేశిం చా రు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే ఏప్రిల్ లో తీసుకుని ఉంటే ఉద్యోగుల నుంచి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తమయ్యేది కాదని పలువురు అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం.