మిషన్ కాకతీయలో అక్రమాలు | in mission kakatiya Irregularities | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయలో అక్రమాలు

Apr 26 2015 12:49 AM | Updated on Sep 3 2017 12:52 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెపుతున్న మిషన్ కాకతీయలో అక్రమాలు చోటుచేసుకున్నాయని...

 హన్మకొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెపుతున్న మిషన్ కాకతీయలో అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అనుయాయులకు దక్కని టెండర్లను అధికార యంత్రాంగం రద్దు చేసిందని, తిరిగి రెండోసారి టెండర్లు పిలిచి ఈ టెండర్లలో ఎవరు పాల్గొనవద్దని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ స్వ యంగా ఫోన్ చేసి కాంట్రాక్టర్లను బెదిరించారన్నారు.

బెదిరింపులకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను కలెక్టర్ చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందించారు. కాగా మే 2న మేధావులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులచే రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాయకులు దిలీప్‌నాయక్, మల్లాడి తిరుపతిరెడ్డి, కొత్త దశరథం, జన్నె మొగిళి, కుమారస్వామి, త్రిలోకేశ్వర్, కాసర్ల రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement