‘లగడపాటికి.. ఆ భూమికి ఉన్న సంబంధం ఏంటి?’

IG Nagi Reddy Fires On Lagadapati Raja Gopal Over Land Dispute - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పారిశ్రామిక వేత్త జీపీ రెడ్డి ఇంట్లో పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాడి రాజగోపాల్‌ పోలీసుల తీరుపై మండిపడ్డారు. కేవలం ఐజీ నాగిరెడ్డి ఒత్తిడి మేరకే పోలీసులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లగడపాటి ఆరోపణలపై ఐజీ నాగి రెడ్డి స్పందించారు. జీపీ రెడ్డిపై చర్యలు తీసుకుంటే లగడపాటి ఎందుకు అడ్డు తగులుతున్నాడని ప్రశ్నించారు. లగడపాటికి.. ఈ భూమికి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని ఐజీ నాగి రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఉన్న భూమికి తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ భూమిని తన అత్తగారి తల్లి కొనుగోలు చేశారని తెలిపారు. ఈ భూమి వ్యవహారంలో తాను ఇంత వరకూ తల దూర్చలేదని స్పష్టం చేశారు. రెండేళ్లగా ఎలాంటి చర్యలు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నానన్నారు. జీపీ రెడ్డి గతంలో ఫోర్జరి డ్యాకుమెంట్లు​ సృష్టించి ఈ భూమి అమ్మే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. విమెక్‌ కో ఆపరేటివ్‌ సోసైటీలోని మా కుంటుంబ సభ్యుల.. బాధిత సోసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకే బంజారాహిల్స్‌ పోలీసులు జీపీ రెడ్డి ఇంటకి వెళ్లారని తెలిపారు. ఈ వివాదంలో లగడపాటి పదేపదే తన పేరు ప్రస్తావించడం సరికాదంటూ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top