వారెవ్వా.. గ‘మ్మత్తు’ ఐడియా..!

A idea for Alcohol Selling

తిమ్మాజిపేట: మద్యం అమ్మడం కోసం ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోరు అనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ప్రధాన రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొత్తగా లక్కీ డ్రాలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులకు అక్టోబర్‌ ఒకటవ తేదీనే ప్రధాన రహదారికి 225 మీటర్ల దూరంలో వైన్స్‌షాపులను ఏర్పాటు చేసుకోవడం కష్టతరమైంది.

చేసేదిలేక నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట అయ్యప్ప వైన్స్‌ షాప్‌ యజమాని షాపు నిర్మాణం జరిగే వరకు ఓ పాత కంటెయినర్‌ను పట్టుకొచ్చాడు. ఇందులోనే దుకాణాన్ని ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు శ్రీకారం చుట్టాడు. కంటెయినర్‌లో వైన్‌ షాపును ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Back to Top