
జగిత్యాల: జగిత్యాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి ఆ స్థానంలో నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను గెలిపించుకుంటామన్నారు. జగిత్యాలలో బుధవారం జరిగిన కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరయ్యారు. కవిత హుజూర్‌నగర్ నుంచి పోటీ చేస్తారా? అని పలువురు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. కవిత హుజూర్‌నగర్ నుంచి పోటీ చేయబోరని స్పష్టం చేశారు.