నేను, కేసీఆర్ కాంగ్రెస్లో పనిచేశాం | i have worked with kcr in congress, says farooq hussain | Sakshi
Sakshi News home page

నేను, కేసీఆర్ కాంగ్రెస్లో పనిచేశాం

Jul 1 2014 1:34 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని శాసన మండలి ఛైర్మన్ పదవికి ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్న ఫారుఖ్ హుస్సేన్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని శాసన మండలి ఛైర్మన్ పదవికి ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్న ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే ఎమ్మెల్సీలంతా పార్టీకి కట్టుబడి ఉండాలని, ఛైర్మన్గా తన విజయానికి కృషి చేయాలని ఆయన చెప్పారు.

అన్ని పార్టీల ఎమ్మెల్సీలను తాను వ్యక్తిగతంగా వెళ్లి కోరుతానని ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశామని, అదే అనుబంధంతో ఇప్పుడు ఆయనను కూడా కలిసి తన విజయానికి సహకరించాల్సిందిగా కోరుతానని హుస్సేన్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement