‘మేడమ్‌ మీ చేతులు అతన్ని రక్షించలేవు’ | Hyderabad Traffic Police Awareness To People With Social Media | Sakshi
Sakshi News home page

May 4 2018 7:28 PM | Updated on Oct 2 2018 4:26 PM

Hyderabad Traffic Police Awareness To People With Social Media - Sakshi

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షేర్‌ చేసిన ఫొటో

సాక్షి, హైదరాబాద్ : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ఉపయోగించాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. హెల్మెట్‌లు వాడని బైకర్స్‌కు జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికి కొందరు హెల్మెట్‌ వాడకుండా అజాగ్రత్త వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వినూత్నంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్‌ ధరించని బైకర్స్‌ ఫొటోలను, వారికి విధించిన జరిమానాలను షేర్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ (హెచ్‌వైడీటీపీ) అధికారిక ట్విటర్‌లో చేసిన పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సేఫ్‌ డ్రైవ్‌.. అవగాహన కోసమని ట్వీట్‌ చేసిన ఫొటోలో.. దంపతులిద్దరూ బైక్‌పై వెళ్తున్నారు. అయితే బండి నడుపుతున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించకపోగా.. వెనుక కూర్చున్న మహిళ హెల్మెట్‌ పెట్టుకుంది. అంతేకాకుండా ఆమె తన చేతిని ఆ వ్యక్తి తలపై రక్షణగా పెట్టింది. దీనికి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సోషల్‌ మీడియా విభాగం ‘ఈ ఫొటోలో ఎంతో ప్రేమ కనిపిస్తుంది. కానీ మేడమ్‌‌.. మీ చేతులు అతన్ని రక్షించలేవు. హెల్మెట్‌ ఖచ్చితంగా పెట్టుకోవాలి’  అనే క్యాప్షన్‌తో ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నపోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement