అనుమానం పెనుభూతమైంది. తన స్నేహితునితో అక్రమ సంబంధం అంటగట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడతేర్చాడు.
మాదాపూర్ (హైదరాబాద్) : అనుమానం పెనుభూతమైంది. తన స్నేహితునితో అక్రమ సంబంధం అంటగట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడతేర్చాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంనకు చెందిన వసంత్‌కుమార్(32) మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌కు చెందిన మంజుల(27)ను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వసంత్ కుమార్ డ్రైవర్‌గా, మంజుల ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మాదాపూర్‌లోని చందానాయక్ తండాలో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు అఖిలేష్(7), కూతురు దివ్య(6) ఉన్నారు.
కాగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో స్నేహితుడు గోవింద్‌తో కలిసి ఇంటికి చేరుకున్న వసంత్‌కుమార్ అర్థరాత్రి వరకు మద్యం తాగాడు. అనంతరం నిద్రపోయాడు. తెల్లవారుజామున నిద్ర లేచిన వసంత్.. గోవింద్‌తో అక్రమ సంబంధం నెరుపుతున్నావంటూ భార్యను విపరీతంగా కొట్టాడు. మంజుల తలకు తీవ్రగాయాలు కాగా కుడి చేయి విరిగిపోయింది. వెంటనే స్థానికులు 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంజుల శనివారం ఉదయం 5 గంటలకు చనిపోయింది. సంఘటన సమయంలో అక్కడ గోవింద్ లేడని పోలీసులు తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసుకుని పోలీసులు వసంత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.