భార్యను గొడ్డలితో నరికిన భర్త | Husband attacked wife with an axe | Sakshi
Sakshi News home page

భార్యను గొడ్డలితో నరికిన భర్త

May 23 2015 8:01 AM | Updated on Sep 3 2017 2:34 AM

భార్యను హతమార్చేందుకు ఓ భర్త ప్రయత్నించాడు. ఆమెను మట్టుబెట్టేందుకు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది.

నల్లగొండ: భార్యను హతమార్చేందుకు ఓ భర్త ప్రయత్నించాడు. ఆమెను మట్టుబెట్టేందుకు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నల్లగొండ మండలం చందనపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాపయ్యకు ఆరేళ్ల కిందట నాగమణితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భార్య, భర్తలు ఇద్దరు తరచూ గొడవపడేవారు. శనివారం కూడా వీరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో పాపయ్య, నాగమణిని గొడ్డలితో నరికాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పాపయ్యను ప్రతిఘటించి నాగమణిని ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలు ప్రస్తుతం నగరంలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement