కిటకిటలాడుతున్న టోల్‌గేట్లు.. | Huge Traffic Jam at Toll plazas in Telugu States | Sakshi
Sakshi News home page

కిటకిటలాడుతున్న టోల్‌గేట్లు..

Oct 2 2017 7:11 PM | Updated on Aug 28 2018 4:00 PM

Huge Traffic Jam at Toll plazas in Telugu States - Sakshi

సాక్షి, నల్గొండ: పండుగ సంబరం ముగిసింది. వరుస సెలవులతో పల్లెలకు పరుగులు పెట్టిన ప్రజలు తిరిగి భాగ్యనగరంవైపు అడుగులు వేస్తున్నారు. దసరా సెలవులు కావడంతో సుమారు 15లక్షల మందిపైగా హైదరాబాద్‌ విడిచి స్వస్థలాలకు వెళ్లారు. సెలవుల అనంతరం నగరానికి తిరిగి పయనమయ్యారు. వర్షాలు కురుస్తున్నా హైదరాబాద్‌కు క్యూ కట్టారు. దీంతో నగరానికి వచ్చే దారులన్నీ రద్దీతో నిండిపోయాయి. టోల్‌గేల్‌లు అన్నీ వాహనాలతో నిండిపోయాయి.

నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌గేట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. దసరా విడిది కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారు నగరానికి తిరుగు ప్రయాణం అవ్వడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. కార్లు, బస్సులు కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా నందిగామ వద్దకూడా వాహనాలు బారులు తీరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement