
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం... అదుపులోకి మంటలు
నగరంలోని నాంపల్లి బజార్ఘాట్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి బజార్ఘాట్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు 15కి పైగా ఫైరింజన్లు, ఒక వాటర్ క్యానన్లతో సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్తో మొదట మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో ఎగసిపడిన మంటల కారణంగా ఒక షెడ్డులో 20పైగా సిలెండర్లు పేలాయి. ఐటీఐ గోదాముల్లో 30పైగా షెడ్లు అగ్నికి ఆహుతైయ్యాయి. దాంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. ఆయనతోపాటు హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఇతర పోలీస్ అధికారులు ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.