పంచాయతీలు బతికేదెట్లా?

పంచాయతీలు బతికేదెట్లా? - Sakshi


- రాష్ట్ర బడ్జెట్ నుంచి స్థానిక సంస్థలకు నిధులివ్వని సర్కారు

- కేంద్రం నేరుగా ఇచ్చిన నిధులపైనా ఆంక్షలు

- ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకాలు

- సీనరేజీ, స్టాంపు డ్యూటీల్లో వాటాలూ ఇవ్వలేదు

- అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయంటున్న సర్పంచులు

- రోజువారీ కార్యక్రమాలకూ నిధుల్లేవని ఆందోళన

- పరిస్థితి ఇలాగే ఉంటే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరిక

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోవడమే కాదు.. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి వాటికీ నిధుల్లేని దుస్థితి నెలకొంది. రెండున్నరేళ్లుగా స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎటువంటి నిధులు ఇవ్వకపోవడంతోపాటు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా వచ్చే ఆర్థిక సంఘం నిధులపైనా ఆంక్షలు పెట్టడమే దీనికి కారణం. స్థానిక సంస్థలకు బడ్జెట్ కేటారుుంపులపై సలహాలు, సూచనలివ్వాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ)ను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా సుప్తచేతనావస్థలోనే ఉంచిందంటేనే పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీల సంఘాలు పేర్కొంటున్నాయి.



 స్పందించకుంటే ఉద్యమమే!

 రెండున్నరేళ్లుగా పంచాయతీలకు నయాపైసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రమిచ్చే నిధులను చూపి గ్రామజ్యోతి పేరిట ఓ అభూత కల్పనను ప్రజల ముందుకు తెచ్చిందని పంచాయతీరాజ్ చాంబర్ ఆరోపిస్తోంది. పంచాయతీల్లో కేరళ తరహా పాలన తెస్తామంటున్న పాలకులు... ఆ రాష్ట్రంలో మాదిరిగానే స్థానిక సంస్థలకు బడ్జెట్లో 40శాతం నిధులు కేటారుుంచేలా చూడాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునేందుకు వీలుగా ట్రెజరీల్లో ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ‘చలో అసెంబ్లీ’ పేరిట భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.



 ఎన్నో సమస్యల్లో పంచాయతీలు

 ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధుల్లో తొలివిడతగా కేంద్రం రూ.401 కోట్లను కేటారుుంచింది. కానీ ఆ నిధులు  విడుదల కాకుండా ట్రెజరీల్లో ఫ్రీజింగ్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవమైన 460 గ్రామ పంచాయతీలకు పారితోషికాలు ఇంతవరకూ విడుదల చేయలేదు. స్వచ్ఛ భారత్  కార్యక్రమం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. సీనరేజీ, స్టాంపుడ్యూటీల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు అందాల్సిన వాటాను కూడా ఇవ్వలేదు. ఇక స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో 40శాతం కేటారుుస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు.



అసలు ప్రజాప్రతినిధులకు నెలనెలా రావాల్సిన వేతనాలకు సంబంధించి ఆరు నెలల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. పంచాయతీల్లో జారుుంట్ చెక్‌పవర్‌ను రద్దు చేసి.. సర్పంచులకు మాత్రమే చెక్‌పవర్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పునూ నేటికీ అమల్లోకి తీసుకురాలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేసినా.. చైర్మన్‌ను, సభ్యులను నియమించలేదు. గత ఎనిమిదేళ్లుగా గ్రామ పంచాయతీల్లో పేరుకుపోరుున విద్యుత్ బిల్లులు రూ.1,050 కోట్లను ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచులు మొత్తుకుంటున్నా స్పందించడం లేదు. పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం వలన అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణకు వీల్లేకుండా పోరుుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన 29 అధికారాలను.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బదలారుుంచ లేదు.

 

 నిధులపై ఆంక్షలు ఎత్తివేయాలి

 ‘‘గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులున్నా.. వాటిని వాడుకునేందుకు వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా నియంత్రణ (ఫ్రీజింగ్) పెట్టడం దురదృష్టకరం. గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నందున వెంటనే ట్రెజ రీల్లో ఆంక్షలు ఎత్తివేయాలి. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులను నియమించకపోవడం వలన గ్రామాలకు సక్రమంగా నిధులు వచ్చే పరిస్థితి లేదు. కనీసం ప్రజలు చెల్లించిన ఆస్తిపన్నును వినియోగించుకునేందుకు కూడా ప్రభుత్వం వీలు కల్పించకపోవడం బాధాకరం..’’  

 - మెంటేపల్లి పురుషోత్తం, రాష్ట్ర సర్పంచుల సంఘం కన్వీనర్

 

 తప్పించుకు తిరగాల్సి వస్తోంది

 ‘‘ఎన్నికై  మూడేళ్లు దాటినా సర్పంచులు గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పనీ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ప్రజలకు ముఖం చూపించలేక తప్పించుకు తిరగాల్సిన దుస్థితి. రాష్ట్ర బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా పంచాయతీలకు కేటారుుస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. రాజ్యాంగం పంచాయతీలకు కల్పించిన అధికారాలను ప్రభుత్వాలు ఇంకా బదలారుుంచకపోవడంతో... పంచాయతీల పాలనలో ఎమ్మెల్యేల జోక్యం పెరిగింది. ఎమ్మెల్యేల ఆదేశాలకే అధికారులు ప్రాధాన్యత ఇస్తుండడంతో గ్రామసభల్లో నిర్ణయాలకు విలువ లేకుండా పోతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా త్వరలో ‘చలో అసెంబ్లీ’ చేపడతాం..’’

     - చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top