చాలీచాలని జీతంతో బతుకు బండి లాగించలేక ఓ హోంగార్డు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సీఎం హామీ నెరవేర్చలేదని..
Sep 18 2017 4:15 PM | Updated on Sep 19 2017 4:44 PM
- హోంగార్డు ఆత్మహత్య
కామారెడ్డి: చాలీచాలని జీతంతో బతుకు బండి లాగించలేక ఓ హోంగార్డు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శాసన సభ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో.. ఈ దుర్భర పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నానని లేఖ రాసి తనువు చాలించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సోమవారం వెలుగుచూసింది. బిక్కునూరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నశివ ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని చెప్పి మాట తప్పారని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు.
Advertisement
Advertisement