హోంగార్డు ఆత్మహత్య | Home guard commits suicide | Sakshi
Sakshi News home page

హోంగార్డు ఆత్మహత్య

Nov 30 2015 6:39 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో ఓ హోంగార్డు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని బద్వేల్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

రాజేంద్రనగర్ (హైదరాబాద్) : కుటుంబ కలహాలతో ఓ హోంగార్డు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని బద్వేల్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన జె.రమాకాంత్(35) అనే వ్యక్తి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు(హెచ్‌జీ 357)గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement