అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధం | home burnt in dichpally with short circuit | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధం

Aug 9 2015 4:25 PM | Updated on Sep 3 2017 7:07 AM

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ నివాస గృహం పూర్తిగా కాలిపోయింది.

నిజామాబాద్(డిచ్‌పల్లి): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ నివాస గృహం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని మెండ్రాజ్‌పల్లి గ్రామంలో పోతునోళ్ల నర్సయ్య ఇల్లు షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ. 2లక్షల నగదు, 20 తులాల బంగారం కాలి బూడిద అయింది. దాదాపు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యాజమాని వాపోతున్నారు. కాగా, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement