మెట్రో రైలులో ఊడిపడిన  సీలింగ్‌!

HMR MD N.V.S Reddy Replies Over Metro Incident At Khairatabad - Sakshi

ఎలాంటి ఘటనా చోటుచేసుకోలేదన్న హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : అత్యంత రద్దీగా ఉన్న ఓ మెట్రోరైలు బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్‌) ఊడిపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వెళుతున్న మెట్రో రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో పలువురు పైకప్పునకు ఉన్న హ్యాండిల్‌ను పట్టుకొని నిలుచున్నారు. పరిమితికి మించి జనం దాన్ని పట్టుకోవడంతో కొంత భాగం ఊడి తమపై పడినట్లు కొందరు తెలిపారు. ఈ ఘటనతో ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌లో రైలును కొద్దిసేపు నిలిపినట్లు సమాచారం.అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. బోగీలోపలి భాగాలు అత్యంత తేలికైన ఫైబర్‌తో తయారు చేసినవి కావడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలుస్తోంది. దీనిపై హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిని వివరణ కోరగా..మెట్రో బోగీలో ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top