ఆరోరోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు | Himachal Pradesh tragedy: Search operations continue | Sakshi
Sakshi News home page

ఆరోరోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు

Jun 13 2014 9:50 AM | Updated on Sep 2 2017 8:45 AM

తలచుకుంటేనే కన్నీళ్లు వచ్చే ఘటన. చేతికి వచ్చిన బిడ్డలు బియాస్‌ నదిలో కలిస్తే..ఏడవటం తప్ప ఏం చేయలేని స్థితి.

మండి : తలచుకుంటేనే కన్నీళ్లు వచ్చే ఘటన. చేతికి వచ్చిన బిడ్డలు బియాస్‌ నదిలో కలిస్తే..ఏడవటం తప్ప ఏం చేయలేని స్థితి. ఈ దుర్ఘటన జరిగి  ఆరు రోజులు అవుతున్న ఇప్పటి వరకూ ఎనిమిది మృతదేహాలే దొరికాయి. గల్లంతు అయిన మరో 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద ఘటనలో మొత్తం 24 మంది విద్యార్థులు గల్లంతు అయిన విషయం తెలిసిందే.

 ఇంకా పదహారుమంది విద్యార్థులతోపాటు టూర్ మేనేజర్ ప్రహ్లాద్ ఆచూకీ తెలియాల్సి ఉంది. గజ ఈతగాళ్లతోపాటు అదనపు బలగాలు కూడా తరలిరావడంతో గాలింపు చర్యలు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు వనస్థలిపురానికి చెందిన అరవింద్, ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఉపేందర్ మృతదేహాలు ఈరోజు హైదరాబాద్ రానున్నాయి.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement