breaking news
V.N.R. Vignana Jyothi
-
లార్జీ డ్యాం నీటి విడుదల నిలిపివేత!
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంత అయిన విద్యార్థుల గాలింపు కోసం లార్జీ డ్యాం నీటి విడుదలను పూర్తిగా నిలిపి వేయనున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి మూడు గంటలపాటు నీటి విడుదలను అధికారులు పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నదిలోని నీటి పారుదలను పూర్తిగా నిలిపివేసి విద్యార్థుల గాలింపుకు అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. కాగా గల్లంతు అయిన విద్యార్థుల గాలింపు కోసం 600 మంది సహాయక సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకూ 8 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
ఆరోరోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు
మండి : తలచుకుంటేనే కన్నీళ్లు వచ్చే ఘటన. చేతికి వచ్చిన బిడ్డలు బియాస్ నదిలో కలిస్తే..ఏడవటం తప్ప ఏం చేయలేని స్థితి. ఈ దుర్ఘటన జరిగి ఆరు రోజులు అవుతున్న ఇప్పటి వరకూ ఎనిమిది మృతదేహాలే దొరికాయి. గల్లంతు అయిన మరో 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద ఘటనలో మొత్తం 24 మంది విద్యార్థులు గల్లంతు అయిన విషయం తెలిసిందే. ఇంకా పదహారుమంది విద్యార్థులతోపాటు టూర్ మేనేజర్ ప్రహ్లాద్ ఆచూకీ తెలియాల్సి ఉంది. గజ ఈతగాళ్లతోపాటు అదనపు బలగాలు కూడా తరలిరావడంతో గాలింపు చర్యలు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు వనస్థలిపురానికి చెందిన అరవింద్, ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఉపేందర్ మృతదేహాలు ఈరోజు హైదరాబాద్ రానున్నాయి.