శిశువు ప్రాణాలు కోల్పోతే...బెయిలబుల్‌ కేసా

High Court Serious On FIR Over Shine Hospital Fire Accident - Sakshi

షైన్‌ ఆస్పత్రి ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ తీరుపై కోర్టు ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: షైన్‌ ఆçస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి ఒక శిశువు ప్రాణం కోల్పోతే  నిందితులపై  304(ఏ) బెయిలబుల్‌ కేసు పెట్టడమేమిటని  పోలీసుల తీరుపై రంగా రెడ్డి జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తపరచింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్‌ను  తన కున్న అధికారాలతో ఇన్‌చార్జి మేజిస్ట్రేట్‌  రెండో అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ కవితాదేవి ఎఫ్‌ఐఆర్‌లో  304 పార్ట్‌(2)నాన్‌బెయిలబుల్‌గా  మార్పుచేశారు. నిర్లక్ష్యంతో వ్యవహరించి శిశువు ప్రాణాలు పోడానికి కారణమైన నిందితులపై బెయిల బుల్‌ సెక్షనునమోదుచేయడం సమంజసం కాదని పోలీసులకు చురకలంటించారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇన్‌చార్జి మేజిస్ట్రేట్‌ ఎఫ్‌ఐఆర్‌లో మార్చిన 304 పార్ట్‌(2) ప్రకారం నేరం రుజువైతే నిందితులకు పదేళ్ల పాటు శిక్షపడే అవకాశం ఉంది.షైన్‌ ఆసుపత్రి ఎండీ సునీల్‌కుమార్‌ రెడ్డితో పాటు మరో నలుగురు సిబ్బందిని  పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. నిందితుల తరఫున న్యాయవాది తమ క్లైంట్ల కు బెయిల్‌ ఇప్పించే ప్రయత్నాల్లో ఉండగా మేజిస్ట్రేటు తీసుకున్న నిర్ణయం వారిని విస్మయానికి గురిచేసింది. గతంలో హైదరా బాద్‌లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో చిన్నారి రమ్య మృతిచెందిన సంఘటన నుంచి పోలీసులు ఇలాంటి కేసుల్లో నాన్‌ బెయిల బుల్‌ సెక్షన్‌నే నమోదు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top