ఐదు జిల్లాల్లో హైఅలర్ట్‌..

High alert in five districts in telangana - Sakshi

మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ, ఐజీ పర్యటన

సాక్షి, హైదరాబాద్‌/గోదావరిఖని: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మావోయిస్టుల ఉనికి పోలీసు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల వేళ ఐదు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంటుందని భావిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చింది. దీంతో ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసే ందుకు నేరుగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ప్రశా ంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు చేపట్టాల్సిన అంశాలపై గురువారం జిల్లాల్లో పర్యటించారు.

ఉనికి చాటుతున్న మావోలు..
గోదావరి పరీవాహక జిల్లాలుగా ఉన్న ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మంలో మావోయిస్టు యాక్షన్‌ కమిటీల కదలికలు భారీ స్థాయిలోనే ఉన్నట్లు స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) గుర్తించింది. దీనికి బలం చేకూరుస్తూ బుధవారం ఏటూరునాగారం కమిటీ పేరుతో ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ బ్యానర్లు, పోస్టర్లు బయటపడటం ఇప్పుడు మరింత ఆందోళనలో పడేసింది. బ్యానర్లు పెట్టి వాటి కింద మావోయిస్టులు ల్యాండ్‌మైన్లను పాతిపెట్టడం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడికి గురిచేసింది. ఈ జిల్లాల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజుల నుంచి మావోయిస్టు పార్టీకి, సీఆర్పీఎఫ్‌ బలగాలకు మధ్య పోరాటం జరుగుతోంది. ల్యాండ్‌మైన్లు పేలు స్తూ మావోయిస్టు పార్టీ భారీ స్థాయిలో స్పందిస్తోంది.

మూడు సవాళ్లు..: మావోయిస్టు కదలికల నేపథ్యలో పోలీసు శాఖ ఎదు ట మూడు సవాళ్లున్నాయి. ఆయా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తు న్నారు. వీరికి భద్రత కల్పించడం మొదటి ప్రాధా న్యం కాగా, ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిన అధికారులు, సిబ్బంది భయాందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పని చేయడం రెండో ప్రాధాన్యం. మావోలను ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్ర సరిహద్దులోకి అడుగుపెట్టకుండా, అంతర్గతంగా ఉన్న యాక్షన్‌ కమిటీలపై దృష్టి పెట్టడం మూడో సవాలు. ఇవి పోలీసు శాఖకు కత్తి మీద సాములాంటివని ఇంటెలిజెన్స్‌ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లూ పెద్దగా కనిపిం చని మావోల డివిజన్‌ కమిటీలు ఒక్కసారిగా వ్యూహా త్మకంగా దాడులకు పాల్పడటం పోలీసు శాఖను శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

పెద్దపల్లిలో పర్యటించిన డీజీపీ..
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. మావోయిస్టుల నియంత్రణకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు జరగనిచ్చే అవకాశమేలేదని తేల్చిచెప్పారు.  ఐజీ నాగిరెడ్డి రెండ్రోజుల నుంచి గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు, నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై పెద్దపల్లి, మంచిర్యాలకు చెందిన పోలీసు అధికారులతో డీజీపీ సమీక్షించారు. పోలింగ్‌ స్టేషన్, గ్రామం ప్రాతిపదికగా భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సమావేశంలో రామగుండం సీపీ వి.సత్యనారాయణ, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్, ఇంటెలిజెన్స్‌ డీఐజీ ప్రభాకర్‌రావు, గ్రేహౌండ్స్‌ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ప్రమోద్‌కుమార్, మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, అడిషనల్‌ డీసీపీలు రవికుమార్, అశోక్‌కుమార్, ఏఆర్‌ అడిషనల్‌ కమాండెంట్‌ సంజీవ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top