సీఎం పర్యటన బందోబస్తు సంఖ్య | heavy security to CM chandrasekhar rao | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన బందోబస్తు సంఖ్య

Oct 7 2014 12:57 AM | Updated on Aug 17 2018 2:53 PM

కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొనేందుకు ఈనెల 8న జిల్లాకు ముఖ్యమంత్రి...

ఆదిలాబాద్ క్రైం : కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొనేందుకు ఈనెల 8న జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రశేర్‌రావు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భీమ్ స్వస్థలమైన కెరమెరి మండలం జోడేఘాట్‌లో వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సోమవారం జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ గజరావు భూపాల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి బందోబస్తు వివరాలు తెలుసుకున్నారు. జిల్లాకు మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న కేసీఆర్‌కు రాష్ట్ర పోలీసు అధికారుల పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఎక్కడా భద్రతా లోపం లేకుండా జోడేఘాట్‌లో అణువణువు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ జోన్ ఐజీ రవిగుప్తా, కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement