కరీంనగర్ జిల్లా మంథని డివిజన్ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది.
మంథని (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా మంథని డివిజన్ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. డివిజన్‌లోని కాటారం, మంథని, మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో భారీ వర్షాల ఫలితంగా పెద్దంపేట, పంకెన, పలిమెల వాగులు పొంగి పొర్లటంతో దాదాపు 18 గ్రామాలకు రాకపోకలతో సంబంధాలు తెగిపోయాయి. వర్షం ధాటికి మంథని మండలం ఉప్పట్ల గ్రామంలోని ఓ పెంకుటిల్లు కూలి రాజపోచం(80) అనే వృద్ధురాలు మృతి చెందింది.