అమ్మ పాలతో ఆరోగ్యం! 

Health With Mother Milk! - Sakshi

బిడ్డకు బలమైన ఆహారం ఇవే..

పుట్టిన గంటకే ఇచ్చే   ముర్రు పాలతో బలం

నేటి నుంచి తల్లి పాల   వారోత్సవాలు

పాలమూరు: బిడ్డ పుట్టగానే తల్లికి మొదటగా వచ్చే పాలను ‘ముర్రు పాలు’ అంటారు. వీటిలో ఔషధ గుణాలు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటంతో పాటు తలీబిడ్డలకు కూడా మేలు జరుగుతుంది. అందుకే తల్లి పాలను అమృతంతో పోలుస్తారు. తల్లిపాలు బిడ్డకు ఆకలిని తీర్చడంతో పాటు వారి మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు అందిస్తాయి. కొందరు తల్లులు అనేక అపోహాలతో బిడ్డలకు పోతపాలు అందిస్తున్నారు. అయితే, ఇది సరికాదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు తల్లుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.  

మారుతున్న జీవన విధానం 

నానాటికీ సమాజంలో వస్తున్న మార్పుల్లో భా గంగా ఈ తరం తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడాని కి సందేహిస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలే ఇలాంటి పనులు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మేరకు తల్లులకు కూడా తల్లిపాల ప్రా ముఖ్యతపై కౌన్సెలింగ్‌ చేయాల్సి ఉంది. ఏటా తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నా కొన్నిచోట్ల త మ పిల్లలకు పాలిచ్చేందుకు అనువైన పరిస్థితులు కరవయ్యాయని సామాజికవేత్తలు ౠవేదన వ్యక్తం చేస్తున్నారు.

మన దేశంలో 1993లో తల్లిపాల వా రోత్సవాల సందర్భంగా ప్రతీ సంస్థలో మాతృ దో హద పరిస్థితులు తీసుకురావాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 2015 వారోత్సవాల్లో కూడా ఇదే ప్రధాన నినాదంగా ఉంది. ఈ విధానాలు, చట్టాల ప్రకారం.. ఉద్యోగం, పని చేసే మహిళలు తమ బి డ్డలకు పాలిచ్చేందుకు అనువైన పరిస్థితులను, స దుపాయాలను సంబంధిత సంస్థలు ఏర్పాటు చే యాల్సి ఉంది. అయినా సమస్యలు తీరడం లేదు.  

బిడ్డకు ప్రయోజనం కోసం 

బిడ్డ పుట్టిన అరగంట లోపు ముర్రుపాలు తాగిస్తే వారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతారని వైద్యులు చెబుతున్నారు. అంటు వ్యాధుల నుంచి రక్షిస్తూ మలబద్దకం తగ్గుతుంది. బాల్యంలో యవ్వనంలో ఉబకాయం వ్యాధుల నుంచి సంరక్షణ ఉంటుంది. పుట్టిన బిడ్డకు చనుపాలు ఇవ్వటంతో రక్తస్రావ ప్రమాదం తగ్గి తల్లి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది.

బలంగా ఉంటూ గర్భానికి పూర్వం ఉన్న బరువుకే తల్లి చేరుకుంటుంది. పాలే సరైన పౌష్టికాహారం బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు అందించాలి. అవి బిడ్డలో రోగనిరోధక శక్తికి, మానసిక వికాసానికి దోహదపడతాయి. ఆరు నెలల వరకు తల్లిపాలే అందించాలి. తల్లిపాలు తాగిన పిల్లలకు తెలివితేటలు బాగుంటాయి. బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లికి రొమ్ము కేన్సర్, రక్తస్రావం నుంచి విముక్తి కలుగుతుంది.   – డాక్టర్‌ రాధ, గైనిక్‌ విభాగం హెచ్‌ఓడీ, జనరల్‌ ఆస్పత్రి, మహబూబ్‌నగర్‌

తల్లిపాల ఆవశ్యకతపై ప్రచారం 

తల్లిపాల ప్రాముఖ్యతపై ఈ వారం రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి బాలింతలు, మహిళలకు అవగాహన కల్పిస్తాం. ప్రతీ గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటుచేయడమే కాకుండా పీహెచ్‌సీల్లో ప్రసవమైన తల్లులు, ఏరియా, సివిల్‌ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులే కాకుండా వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులకు సైతం తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తాం.   – డాక్టర్‌ రజిని, డీఎంహెచ్‌ఓ, మహబూబ్‌నగర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top