వెంటాడిన విషాదం | Haunted by tragedy | Sakshi
Sakshi News home page

వెంటాడిన విషాదం

Aug 21 2015 12:47 AM | Updated on Aug 25 2018 5:41 PM

రాజాపేట : ఒకే ఇంట్లో ఇద్దరు మృతిచెందగా ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మండలకేంద్రానికి చెందిన స్వర్గం అనసూయ (80) గురువారం తెల్లవారుజామున

రాజాపేట : ఒకే ఇంట్లో ఇద్దరు మృతిచెందగా ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మండలకేంద్రానికి చెందిన స్వర్గం అనసూయ (80) గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందింది. సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అనసూయ మరిది స్వర్గం లక్ష్మయ్య (73) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
 
 వదిన మృతిని జీర్ణించుకోలేక చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో ఎవరినోట విన్నా వీరి మృతివార్తే వినిపించింది. లక్ష్మయ్య కృషి చేనేత సహాకార సంఘం సభ్యుడు కావడంతో సంఘం సభ్యులు సంతాపాన్ని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement