హరీష్‌ రావు ఆ సంస్థలో పనిచేయాలి

Harish Rao Should Work in Hindu Vahini to Know About that Activities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గో హత్యలు, లవ్‌ జిహాద్‌, మత మార్పిడి వంటి వాటిని నిరోధించడానికి హిందూ వాహిని పనిచేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వెల్లడించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అందరినీ ఆదరించే హరీష్‌రావు హిందూ వాహిని కార్యకర్తల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. హిందూ వాహిని అంటే ఏమిటో తెలియాలంటే హరీష్‌రావు ఒకసారి హిందూ వాహినిలో పనిచేయాలని సూచించారు. కార్యకర్తలు ఏ కార్యక్రమం తలపెట్టినా పోలీసులు బెదిరించడం, అక్రమ కేసులు పెడతామని వేధించడం మానుకోవాలని కోరారు. హిందూ వాహిని చిన్న సంస్థ కాదని పెద్ద శక్తి అని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు హిందూ వాహిని కార్యకర్తనని రాజాసింగ్‌ వెల్లడించారు. హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయడమే హిందూ వాహిని లక్ష్యమని స్పష్టం చేశారు. దేవీ నవరాత్రులు నిర్వహించే ప్రతీ మండపం వద్ద సనాతన ధర్మం గురించి ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలను ఆదేశించారు. యువకులు దేశ రక్షణ, ధర్మ రక్షణ కోసం పని చేయాలని రాజాసింగ్‌ పిలుపునిచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top