సిద్దిపేటను ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేస్తా..

Harish Rao Says I Will Change Siddipet As Education Hub - Sakshi

వైద్య కళాశాల కల సాకారమైంది

ప్రతీ మండలానికి ఓ గురుకులం ఏర్పాటు

పేద బిడ్డలకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడమే లక్ష్యం: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట జోన్‌: ‘నియోజకవర్గంలోని ప్రతీ విద్యార్థికి కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడమే నా లక్ష్యం. గడిచిన నాలుగున్నరేండ్లలో సిద్దిపేటను ఎడ్యుకేషనల్‌ హాబ్‌గా మార్చే ప్రయత్నం చేశాను. వైద్య కళాశాల కల సాకారం కావడం నా రాజకీయ జీవితంలో ఒక గొప్ప అనుభూతి.

నియోజవర్గంలోని ప్రతీ మండలంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సిద్దిపేటలో పీజీ, డిగ్రీ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్, వెటర్నరీ కళాశాలలు,  మైనార్టీ  గురుకులాలు,  బీసీ, సాంఘీక సంక్షేమ వసతి గృహాలు, మోడల్‌ స్కూల్స్, కేజీబీవీలను విస్తృతంగా ఏర్పాటుచేశాం.

భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో విద్యరంగాన్ని మరింత అభివృద్ధి చేస్తా. విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన విద్యను అందించడమే నా లక్ష్యం.’  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top