కాలువ పనులను పర్యవేక్షించిన హరీష్‌రావు | harish rao monitered canal works | Sakshi
Sakshi News home page

కాలువ పనులను పర్యవేక్షించిన హరీష్‌రావు

Jan 18 2015 4:33 PM | Updated on Sep 2 2017 7:52 PM

నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని చిల్లాయపల్లి కాలువను తెలంగాణ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు పరిశీలించారు.

భూదాన్‌పోచంపల్లి: నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని చిల్లాయపల్లి కాలువను తెలంగాణ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు పరిశీలించారు. జగత్‌పల్లి, నారాయణగిరి, జలాల్‌పూర్ గ్రామాలను సందర్శించి దిగువ భూములకు నీరు సరఫరా అయ్యే మార్గాల గురించి ఆరా తీశారు. చౌటుప్పల్ మండలంలోని గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు.

పనులు నత్తనడకన సాగడంపై సిబ్బందిని మంత్రి మందలించారు. అవసరమైతే లిఫ్ట్ ద్వారా లేదా, కాలువ ద్వారా గాని నీటిని కింది గ్రామాలకు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, టీఆర్‌ఎస్ నాయకులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement