సంగారెడ్డి : ఆరుగురికి కరోనా పాజిటివ్‌

Harish Rao Made Statement About Coronavirus In Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనకు వెళ్లినవారిలో సంగారెడ్డి నుంచి 28 మంది ఉన్నారని, అందులో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. జిల్లాలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హరీశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. కరోనా వచ్చిన ఆరుగురితో పాటు వారి కుటుంబసభ్యులు, మరో 43 మందిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. వారి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపించామన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టులు శుక్రవారం సాయంత్రం వరకు రానున్నాయి. కాగా కరోనా సోకిన ఆరుగురు ఇంటి పక్కన ఉండేవారికి సెకండరీ కాంటాక్ట్‌తో వైరస్‌ సోకే అవకాశాలు ఉన్నాయన్నారు. వీరిని చెక్‌ చేయడానికి 42 మెడికల్‌ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి, అంగడి పేట, కొండాపూర్, జహీరాబాద్ నాలుగు ప్రాంతాలలో నలుగురు అధికారులను నియమించామని, మైనార్టీలు ఎవరు దీనిని నెగెటివ్‌గా తీసుకోవద్దని హితభోద చేశారు. అనవసరంగా భయపడకుండా  డాక్టర్లకు సహకరిస్తూ పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఫైర్ ఇంజిన్, పురుగు మందులు పరికరాలు , డ్రోన్ ద్వారా స్ర్పేయింగ్ జరుగుతుందన్నారు. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 8 పాజిటివ్ కేసులు ఉన్నట్లు హరీశ్‌ తెలిపారు.
(పౌరులకు వీడియో సందేశం ఇవ్వనున్న మోదీ)

('తక్కువ నష్టంతో సంక్షోభం నుంచి గట్టెక్కాలి')

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top