'ఆ నిధులను ఏపీ ప్రభుత్వ విడుదల చేయాలి' | harish rao demands, ap should be released caved funds | Sakshi
Sakshi News home page

'ఆ నిధులను ఏపీ ప్రభుత్వ విడుదల చేయాలి'

Oct 19 2014 2:40 PM | Updated on Sep 2 2017 3:06 PM

'ఆ నిధులను ఏపీ ప్రభుత్వ విడుదల చేయాలి'

'ఆ నిధులను ఏపీ ప్రభుత్వ విడుదల చేయాలి'

ముంపు ప్రాంతాలకు ఇవ్వాల్సిన కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్:ముంపు ప్రాంతాలకు ఇవ్వాల్సిన కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం పులిచింతల ముంపు ప్రాంతాలు, నిర్వాసితుల సమస్యలపై హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాలకు ఇవ్వాలని నిధులను ఏపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్వార్టర్స్ ఆక్రమణకు గురైయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే వృథాగా ఉన్న క్వార్టర్స్ ను బహిరంగంగా వేలం వేస్తామని హరీష్ తెలిపారు.

 

మైనర్ ఇరిగేషన్ ఇద్దరు చీఫ్ ఇంజనీర్లను నియమిస్తామన్నారు. అధికారుల విభజనపై బీజేపీ నేతల విమర్శల కంటే ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తే మంచిదని హరీష్ రావు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement