‘గ్రేటర్’లో మరో 8 స్వైన్‌ఫ్లూ కేసులు | 'Gretarlo 8 flu cases | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’లో మరో 8 స్వైన్‌ఫ్లూ కేసులు

Jan 19 2015 3:28 AM | Updated on Sep 2 2017 7:52 PM

రాష్ట్ర రాజధానిలో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో కేవలం 17 రోజుల్లో ఏడుగురు చనిపోగా, 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో కేవలం 17 రోజుల్లో ఏడుగురు చనిపోగా, 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. హోలిస్టిక్ ఆస్పత్రిలో 39 ఏళ్ల వ్యక్తి, బసవతారకం ఆసుపత్రిలో 57 ఏళ్ల మహిళ, రెయిన్‌బో ఆస్పత్రిలో 8 ఏళ్ల బాలిక, కేర్‌లో 28 ఏళ్ల మహిళతో పాటు 25 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతున్నారు. అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు, కాంటినెంటల్ ఆస్పత్రిలో 38 ఏళ్ల మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement