టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ | green signal for teachers recruitment | Sakshi
Sakshi News home page

టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

Jan 3 2016 3:56 AM | Updated on Aug 14 2018 10:54 AM

టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో 15,628 టీచర్ పోస్టుల భర్తీకి ఓకే చెప్పారు.

సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన  శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో 15,628 టీచర్ పోస్టుల భర్తీకి ఓకే చెప్పారు.

టీచర్ పోస్టుల్లో పదోన్నతులు పోగా ఏర్పడే ఖాళీలు, భవిష్యత్తులో రిటైర్‌మెంట్ ద్వారా ఖాళీ అయ్యేవి కాకుండా ఇప్పటివరకు ఖాళీ అయిన క్లియర్ వేకెన్సీలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నియామకాల విధి విధానాలను విద్యాశాఖ ప్రకటించనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ నాటికి ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement