గ్రేటర్ పోలింగ్ 53.38 % | Greater polling 53.38% | Sakshi
Sakshi News home page

గ్రేటర్ పోలింగ్ 53.38 %

May 2 2014 12:27 AM | Updated on Aug 21 2018 12:12 PM

గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున 53.38 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు లెక్కలు తేల్చారు.

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున 53.38 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు లెక్కలు తేల్చారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం మేరకు పోలింగ్ 54.31 శాతంగా ఉన్నప్పటికీ.. అది తగ్గింది. అం తిమంగా 53.38 శాతం పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

24 నియోజకవర్గాల్లో పటాన్‌చెరులో అత్యధికంగా 67.67 పోలింగ్ నమోదైనప్పటికీ.. గ్రేటర్ పరిధిలో ఆ నియోజకవర్గంలోని రెండు డివిజన్లు మాత్రమే ఉన్నాయి. దాన్ని మినహాయిస్తే అత్యధిక పోలింగ్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 60.46 శాతంగా నమోదైంది. అత్యల్పంగా ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో 47 శాతం నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. 2009 ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 54.18  శాతం కాగా.. ఈసారి అంతకన్నా తగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement