జయనామ సంవత్సరానికి సోమవారం జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. ఈ సంవత్సరం తమకు విజయాలు చేకూర్చాలని ఆకాంక్షించారు.
పరిగి, మొయినాబాద్, న్యూస్‌లైన్: జయనామ సంవత్సరానికి సోమవారం జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. ఈ సంవత్సరం తమకు విజయాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. ఉగాది పర్యదినం సందర్భంగా ప్రతి గ్రామంలో పంచా గ శ్రావణం నిర్వహించారు. తోరణాలతో ఇళ్లను అలంకరించారు. పిండివంటలు, పోలేలు, షడ్రుచులతో కూడిన పచ్చడిని ఆరగించారు. పరి గి, చేవెళ్ల, వికారాబాద్, శంషాబాద్, తాండూరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని ఆలయాలు భక్త జనంతో కిటకిటలాడాయి. ఇదిలాఉంటే ప్రస్తుతం ప్రాదేశిక పోరు జరుగుతున్న నేపథ్యంలో పంచాంగ శ్రవణానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేస్తున్న అభ్యర్థులు తమ పేరున బలాలు, జాతకాలు ఎలా ఉన్నాయని ఆసక్తి అడిగి తెలుసుకున్నారు. పరిగిలో పండితులు సిద్దాంతి పార్థసారథి పంచాంగ పఠనం చేయగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పంచాంగ పఠనాన్ని ఆలకించారు.
వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయి..
జయనామ సంవత్సరంలో అంతా జయమే జరుగుతుందని చిలుకూరు బాలాజీ దేవాలయ పూజారి రంగరాజన్ పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు పంచాగ శ్రవణం చేశారు. ఆలయ మండపంలో ఉత్సవమూర్తులను ప్రతిష్టించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస రాఘవాచార్యు లు, ఆలయ మేనేజింగ్ కమిటీ చెర్మైన్ సౌదరరాజన్, కన్వీనర్ గోపాల కృష్ణస్వామిల సమక్షంలో పంచాగ శ్రవ ణం నిర్వహించారు. ఆలయ పూజారి రంగరాజన్ పంచాగ శ్రవణం చేస్తూ ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా మనుషులు మాత్రం కలిసిమెలిసి ఉంటారని, ప్రేమానురాగాలు పంచుకుంటారని అన్నారు. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేసి, దేవాలయాల పరిరక్షణకుపాటు పడేవారే ఈ సారి ఎన్నికల్లో గెలుస్తారని, అలాంటి వారికే దేవుడు పట్టం కడతారని వివరించారు. పంచాయగ శ్రవణ కార్యక్రమంలో పూజారులు కన్నయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ
తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాల పత్రికను సోమవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస రాఘవాచార్యులు, పూజారులు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల పత్రికలను స్వామివారి పాదాల వద్ద పెట్టి పూజలు నిర్వహించారు. ఈనెల 9 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ తెలిపారు.