
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో ఓవైపు భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మరోవైపు.. వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని పరిగి మండల పరిధిలో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్‌లో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.