పాత లెక్కలు తిరగదోడదాం! | Government working for the additional stake in the Krishna waters | Sakshi
Sakshi News home page

పాత లెక్కలు తిరగదోడదాం!

Jan 20 2017 2:29 AM | Updated on Aug 29 2018 9:29 PM

పాత లెక్కలు తిరగదోడదాం! - Sakshi

పాత లెక్కలు తిరగదోడదాం!

కృష్ణా జలాల్లో గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పూడ్చు కునేందుకు వీలుగా..

కృష్ణా జలాల్లో అదనపు వాటా కోసం ప్రభుత్వ కసరత్తు
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పూడ్చు కునేందుకు వీలుగా.. ఏపీ చేసిన పాత వినియోగ లెక్కలన్నీ బయ టకు తీయాలని తెలంగాణ నిర్ణ యించింది.  నీటి లోటును ఈ విధంగానైనా భర్తీ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 53 టీఎంసీల మేర నీటి లభ్యతే ఉండటం, అందులోనూ 18 టీఎంసీలకు మించి వాటా దక్కకపోవచ్చన్న అంచనా నేపథ్యంలో గతంలో ఏపీ చేసిన అధిక వినియోగ లెక్కలను తీసి వాటిని ఈ ఏడాది నీటిలో కొంతైనా సర్దుబాటు చేయిం చేలా కసరత్తు చేస్తోంది. దీనిపై గురువారం ప్రభుత్వ సలహాదారు ఆర్‌.విద్యాసాగర్‌ రావు, నీటి పారుదలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, సాగర్‌ సీఈ సునీల్‌ ఇతర అధికారులతో చర్చలు జరిపారు.

2014–15 వాటర్‌ ఇయర్‌ లో తన వాటాలకు మించి ఏపీ 45 టీఎంసీలు వినియోగించగా, పోతిరెడ్డిపాడు కింద 11.24 టీఎంసీలు, కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్‌) కింద మరో 23 టీఎంసీలు అధి కంగా వాడుకుందని తేల్చారు. ఈ ఏడాది  కృష్ణాలో ఏపీ 238 టీఎంసీలు వినియోగిం చాల్సి ఉన్నా, 10 టీఎంసీలు అధికంగా వాడుకుందని, పట్టి సీమ నీటిని సైతం కలుపుకొంటే అదనంగా వాడుకున్న నీరు 40 టీఎంసీలకు చేరుతుం దని అధికారులు చెప్పారు. ఇక తెలంగాణకు 138 టీఎంసీల వాటా రావాల్సి ఉన్నా 128 టీఎంసీలే వినియోగించిందన్నారు. అధి కారులు చెబుతున్న అంశాలపై బోర్డుకు లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement