తెలంగాణ వర్సిటీ నియామకాల్లో అక్రమాలపై విచారణ | Government orders to investigate on Telangana varsity requirements | Sakshi
Sakshi News home page

తెలంగాణ వర్సిటీ నియామకాల్లో అక్రమాలపై విచారణ

Apr 11 2014 4:28 AM | Updated on Sep 2 2017 5:51 AM

నిజమాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బోధ నా సిబ్బంది నియామకాల్లో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మహ్మద్ అక్బర్ అలీ ఖాన్ అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సాక్షి, హైదరాబాద్: నిజమాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బోధ నా సిబ్బంది నియామకాల్లో  వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మహ్మద్ అక్బర్ అలీ ఖాన్ అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. యూ నివర్సిటీ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా నియామకాల్లో వీసీ అక్రమాలకు పాల్పడ్డారని, కోర్టులో స్టేను తొలగించకముందే ని యామకాలు చేపట్టారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సీవీ రాములను విచారణ అధికారిగా నియమిం చింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ సీఎస్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లో దీనిపై విచారించి నివేదిక అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
 అసలేం జరిగిందంటే....
 తెలంగాణ వర్సిటీలో గత ఏడాది చేపట్టిన 107 బోధనా సిబ్బంది భర్తీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై ఉన్న త విద్యామండలి ప్రొఫెసర్లు టి.భాస్కర్‌రా వు, ఎం.ఎస్.ప్రసాదరావు నేతృత్వంలో విచారణ జరిగింది. నెట్, స్లెట్ అర్హత లేనివారిని కూడా జాబితాల్లో చేర్చినట్లు,  మార్కు లు దిద్దినట్లు, రిసెర్చ్‌కు ఇచ్చే వెయిటేజీ సరిగా ఇవ్వనట్లు, అలాగే జాబితాల్లోని అన్ని పేజీలపై కాకుండా కేవలం చివరి పేజీపై మాత్రమే వీసీ సంతకం చేసినట్లు వారి విచారణలో తేలింది. దీనిపై ప్రభుత్వం వీసీ వివరణ కూడా కోరింది. అయితే కోర్టులో స్టే తొలగించకముందే నియామకాలను చేపట్టి వీసీ మరిన్ని తప్పిదాలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో తాజాగా రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement