సెట్‌ కన్వీనర్లు ఖరారు | A Govardhan Appointed As EAMCET Convener | Sakshi
Sakshi News home page

సెట్‌ కన్వీనర్లు ఖరారు

Jan 21 2020 1:47 AM | Updated on Jan 21 2020 1:47 AM

A Govardhan Appointed As EAMCET Convener - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్‌ (కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు్ట)ల కన్వీనర్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 2020–21 విద్యా సంవత్సరం సెట్‌లు నిర్వహించే వర్సిటీలను ఇదివరకే ఖరారు చేసిన టీఎస్‌సీహెచ్‌ఈ.. కన్వీనర్ల నియామకాలకు ఆయా వర్సిటీల నుంచి ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. దీంతో ముగ్గురు చొప్పున పేర్లను టీఎస్‌సీహెచ్‌ఈకి ఇచ్చిన నేపథ్యంలో సీనియార్టీ ఆధారంగా ఉన్నత విద్యామండలి కన్వీనర్లను ఎంపిక చేసింది. ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ నియమితులయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement