ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు

Good News For TSRTC Employees About Increment of Salaries - Sakshi

సమ్మెలో పాల్గొన్నవారితో సహా ఉద్యోగులకు ఇంక్రిమెంటు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోవరం ప్రకటించారు. సమ్మెలో పాల్గొన్న వారితోపాటుగా ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇంక్రిమెంటు కేటాయిస్తూ ఇన్‌చార్జీ ఎండీ సునీల్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సీఎం నిర్వహించిన సమావేశం లో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఉత్తర్వు వెలువడింది. సాధారణంగా సమ్మెలు జరిగిన సమయంలో ‘‘నో వర్క్‌ నో పే’’పద్ధతిలో సమ్మె కాలానికి వేతనం ఇవ్వరు.

కానీ ఆర్టీసీ ఉద్యోగులకు 52 రోజుల సమ్మె కాలానికి కూడా విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తూ వేతనం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున సంస్థకు భారం కాకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుందని ఇటీవల సీఎం ప్రకటించారు. ఉద్యోగి మూలవేతనం ఆధారంగా కనిష్టంగా రూ.350 నుంచి రూ.1000 వరకు వివి« ధ కేటగిరీల ఉద్యోగులకు ఇంక్రిమెంటు అందనుంది. ఆ మొత్తం మూలవేతనంలో కలవనున్నందున డీఏ, సహా పలు బెని ఫిట్స్‌ కూడా అంతమేర పెరగనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top