సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ  | Golden Telangana with KCR | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ 

Dec 22 2018 1:57 AM | Updated on Apr 3 2019 8:56 PM

Golden Telangana with KCR - Sakshi

మంచిర్యాల టౌన్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని సినీ నటుడు సుమన్‌ అన్నారు. శుక్రవారం ఆయన మంచిర్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికానని, ఏ ప్రభుత్వం ఏర్పడినా ఒక్క టర్మ్‌ మాత్రమే ఉంటే అభివృద్ధి జరగదని, రెండోసారి అధికారంలోకి వస్తేనే ఏ అభివృద్ధి చేయాలన్నా అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రానికి నిధులు, వనరుల అవసరం ఎంతో ఉందని, అందుకే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన వాటిని తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

తనకు రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన లేదని, అయితే.. మొదటి నుంచి కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ప్రతి ఎన్నికల్లో తాను ఆయన గెలుపు కోసం ఉడత సాయం అందిస్తున్నానని చెప్పారు. తనకు సినిమా పరిశ్రమలో ఎవరూ గాడ్‌ ఫాదర్‌ లేరని, అయినా తనను ప్రేక్షకులు ఆదరించడం వల్లే 41 ఏళ్ల సినీ జీవితంలోకి వచ్చే జనవరిలో అడుగు పెడుతున్నానని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement