పుష్కరాల్లో సాధువులకు ప్రత్యేక ఘాట్ | godavari puskaralu review | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో సాధువులకు ప్రత్యేక ఘాట్

May 23 2015 1:58 PM | Updated on Sep 3 2017 2:34 AM

పుష్కరాల్లో సాధువులకు ప్రత్యేక ఘాట్

పుష్కరాల్లో సాధువులకు ప్రత్యేక ఘాట్

గోదావరి పుష్కరాలకు వచ్చే దిగంబర సాధువుల కోసం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోతే పుష్కర ఘాట్‌ను ప్రత్యేకంగా కేటాయించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.

భద్రాచలం : గోదావరి పుష్కరాలకు వచ్చే దిగంబర సాధువుల కోసం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోతే పుష్కర ఘాట్‌ను ప్రత్యేకంగా కేటాయించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. శనివారం ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఐటీడీఐ కార్యాలయంలో పుష్కర పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూన్ 15 నాటికి పుష్కరాలకు సంబంధించిన పనులన్నీ పూర్తి కావాలని మంత్రి ఇందకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమన్వయంతో అందరూ కలసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలసి పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement