న్యాయవాదులకు సహాయమందిస్తాం | Give assistance to lawyers | Sakshi
Sakshi News home page

న్యాయవాదులకు సహాయమందిస్తాం

Jul 29 2014 1:08 AM | Updated on Mar 28 2018 11:05 AM

న్యాయవాదులకు సహాయమందిస్తాం - Sakshi

న్యాయవాదులకు సహాయమందిస్తాం

వివిధ కోర్టుల్లోని న్యాయవాదులకు తమవంతు సహాయం అందిస్తామని హైకోర్టు న్యాయమూర్తి సి.వి.నాగార్జునరెడ్డి తెలిపారు.

హైకోర్టు జడ్జి సి.వి.నాగార్జునరెడ్డి

 హైదరాబాద్: వివిధ కోర్టుల్లోని న్యాయవాదులకు తమవంతు సహాయం అందిస్తామని హైకోర్టు న్యాయమూర్తి సి.వి.నాగార్జునరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదుల కాన్ఫరెన్స్‌హాల్ నిర్మాణానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కాన్ఫరెన్స్‌హాల్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేస్తున్న న్యాయవాదుల కో ఆపరేటివ్ సొసైటీ సేవలు అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కందుకూరి అశోక్‌బాబు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నాగార్జున్, అడ్వొకేట్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పాపిరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, బార్ కౌన్సిల్ మెంబర్ అనంతసేనారెడ్డి, అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement