ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉప్పలయ్య(36) అనే మున్సిపల్ కార్మికుడు గురువారం ఉదయం ఆత్మహత్యయత్నం చేశాడు.
హైదరాబాద్: ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉప్పలయ్య(36) అనే మున్సిపల్ కార్మికుడు గురువారం ఉదయం ఆత్మహత్యయత్నం చేశాడు. జీహెచ్‌ఎంసీ విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఉప్పలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.