కాప్రాలో పేలిన సిలిండర్‌.. ఒకరు మృతి | Gas Cylinder Explosion At Kapra Secunderabad | Sakshi
Sakshi News home page

Jan 18 2019 8:38 AM | Updated on Jan 18 2019 9:15 PM

Gas Cylinder Explosion At Kapra Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని కాప్రాలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడుతో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి ఆ భవనం పాక్షికంగా కూలిపోయింది. భవనం కూలడంతో చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడికి జనం భారీగా చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గలా కారణాలపై విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement