గ్యాస్‌ సిలిండర్ పేలుడు.. పోలీసులు సహా 30 మందికి గాయాలు | Cops Among 30 Wounded Gas Cylinder Explosion Bihar Aurangabad | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనంలో మంటలు.. 30 మందికి గాయాలు..

Oct 29 2022 2:28 PM | Updated on Oct 29 2022 2:28 PM

Cops Among 30 Wounded Gas Cylinder Explosion Bihar Aurangabad - Sakshi

పాట్నా: బిహార్ ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనంలో భారీ మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పేందుకు వచ్చిన ఏడుగురు పోలీసులు సహా మొత్తం 30 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఒడియా గలి సమీపంలోని అతిచిన్న వీధిలో ఈ ఘటన జరగడంతో సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తాయి. ఛట్ పూజ సన్నాహాల్లో భాగంగా ఓ మహిళ ప్రసాదం తయారు చేస్తుండగా.. గ్యాస్ లీకై ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం క్షణాల్లోనే మంటలు భవనమంతా వ్యాపించాయి.
చదవండి: కోర్టులో మహిళా లాయర్ల సిగపట్లు.. వీడియో వైరల్‌..

Advertisement
 
Advertisement
Advertisement